ఆక్సిజన్ కొరత..మరో 20 మంది ..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆస్పత్రుల్లో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. ఆక్సిజన్ కొరత దేశంలో ఆస్పత్రులను వేధిస్తోంది. ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 20 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఆస్పత్రి డైరెక్టర్ డా. డీకే. బలూజా తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మరో అరగంటకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రిలో మరో 200 మంది వెంటిలేటర్ మీద ఉన్నారని, ఆక్సిజన్ సకాలంలో అందకపోతే వారి పరిస్థితి కూడ ప్రమాదకరంగా మారుతుందని ఆయన తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ అవసరం పెరిగిపోతోంది. దీంతో ఆస్పత్రుల్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది.