ఆక్సిజన్ చెట్టు.. నరికితే కోటి ఫైన్..!
1 min readపల్లెవెలుగు వెబ్: సాగ్వన్ చెట్టు. మధ్యప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్టు తన జీవిత కాలంలో 12 లక్షల విలువ చేసే ఆక్సిజన్ ఇస్తుంది. ఒక్కో స్వాగన్ చెట్టు 60 లక్షలు విలువ చేసే ప్రయోజనాలను చేకూరుస్తాయి. అందుకే దీని కలపకు భారీ డిమాండ్ ఉంటుంది. మధ్య ప్రదేశ్ లోని భమోరి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి స్వాగన్ చెట్టును నరికినందుకు అటవీ శాఖ అధికారులు 1.21 కోట్ల ఫైన్ విధించారు. రెండు చెట్లను అక్రమంగా నరికి.. కలపను అమ్మినందుకు చోటే లాల్ అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసి.. జరిమాన విధించారు. 12 లక్షల విలువైన ఆక్సిజన్ అందించే చెట్టను నరికితే కోటి రూపాయల ఫైన్ విధించకుండా ఎలా ఉంటారు అని స్థానికులు అంటున్నారు. ఎన్ని కోట్లు పెట్టి కొంటే మాత్రం చెట్లు అందించే ఆక్సిజన్ అందుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఆక్సిజన్ అవసరం ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చూస్తున్నాం అంటున్నారు.