పెళ్లికాని జంటలకు ‘ఓయో’ స్పెషల్ రూమ్స్..!
1 min readపల్లె వెలుగు వెబ్: సహజీవనం అనేది మెట్రో సిటీల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందే సహజీవనం చేస్తున్నారు. పట్టణాల్లో ఇలాంటి పద్దతులు లేకపోయినప్పటికీ.. మెట్రో సిటీల్లో ఈ కల్చర క్రమేనా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హోటల్ చైన్ నిర్వహణ సంస్థ ఓయో
వినూత్నపద్ధతికి శ్రీకారం చుట్టింది. పెళ్లికాని జంటలకు హోటల్ రూమ్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. సాధరాణంగా పెళ్లికాని జంటలకు మన దేశంలో చాలా హోటళ్లు బస చేయడానికి రూమ్స్ ఇవ్వవు. విహార యాత్రలకు..ఔటింగ్.. డేటింగ్..వెళ్లే జంటలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యను గమనించిన ఓయో.. రిలేషన్ షిప్ మోడ్ అనే కొత్త ఆప్షన్ ను చేర్చింది. ఈ ఆప్షన్ ద్వార పెళ్లికాని జంటలు రూమ్ ను బుక్ చేసుకోవచ్చు. ఎవరి నుంచి ఎలాంటి ప్రశ్నలు , ఇబ్బందులు ఉండవు. ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన ఓయో సిబ్బంది వాటిని పరిష్కరిస్తుంది.
సంప్రదాయవాదులకు ఈ నిర్ణయం రుచిస్తుందా?
మన దేశంలో పెళ్లికి ముందు సహజీవనం చేయడం చట్టరీత్యా తప్పు కాదు. అయినా ఎన్నోఏళ్లనాటి భావజాలంతో , సంప్రదాయ, ఆచార వ్యవహారాలు పాటిస్తున్న వారికి ఈ నిర్ణయం నచ్చకపోవచ్చు. ఎందుకంటే… పెళ్లికి ముందే సహజీవనం అంటే…చాలా మందికి నచ్చదు. అలా చాలా కుటుంబాల్లో జరగదు కూడ. ఏదో అడ్వాన్స్డ్ మెంటాలిటీ ఉన్న కుటుంబాల్లో తప్ప.. ఎక్కువ శాతం ఇందుకు ఒప్పుకోరు.
‘ఓయో’ ఉద్దేశం ఏమటి?
ఓయో ప్రధానంగా తన కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. విహారయాత్రలకు వెళ్లినప్పుడు పెళ్లికాని జంటలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రిలేషన్షిప్ మోడ్ ఆప్షన్ ను చేర్చింది. ఇప్పటికే కొన్ని స్టార్ట్ అప్ లు కేవలం రిలేషన్ షిప్ లో ఉన్న వారికి మాత్రమే రూమ్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ పోటీని ఎదుర్కోవడానికి ఓయో ఈ నిర్ణయం తీసుకుంది.
ఓయో పార్ట్నర్స్ ఒప్పుకుంటారా?
ఓయో సంస్థకు సొంతంగా హాటల్స్ లేవు. కేవలం ఇప్పటికే ఉన్న హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకుని బిజినెస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఓయో తీసుకున్న ఈ నిర్ణయానికి ఏ మేరకు మద్దతు ఉంటుందనేది అసలు ప్రశ్న. మెట్రో సిటీల నుంచి ఓయో తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ.. పట్టణాల్లో కొంత వ్యతిరేకత ఉంది. కేవలం అనుమతి తీసుకున్న హోటల్స్ లో మాత్రమే .. ఈ రిలేషన్ ఫిప్ మోడ్ రూమ్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. తమ పార్ట్నర్స్ అభిప్రాయం కూడ తమకు ముఖ్యమని అంటున్నారు ఓయో ప్రతినిధులు.