ప.గో. జెడ్పీ చైర్మన్గా కవురు శ్రీనివాస్
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా కవురు శ్రీనివాస్ ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. ఎన్నికలలో యలమంచిలి జడ్పిటిసిగా గెలుపొందిన కవురు. శ్రీనివాస్ ను జడ్పి చైర్మన్ అభ్యర్థిగా నిడమర్రు జడ్పిటిసిగా గెలుపొందిన కోడె వెంకట కాశీ విశ్వనాథ్ ప్రతిపాదించగా, ద్వారకా తిరుమల జడ్పిటిసిగా గెలుపొందిన చిగురుపల్లి శామ్యూల్ బలపరిచారు. దీంతో ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో జెడ్పీ చైర్మన్ గా కౌర్ శ్రీనివాస్ ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు.
అనంతరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా తాల్లపూడి జడ్పిటిసి పోసిన శ్రీలేఖను పొడూరు జడ్పిటిసి గుంటూరి పెద్దిరాజు ప్రతిపాదించగా, మొగల్తూరు జడ్పిటిసి తిరుమాని బాపూజీ బలపరిచారు. అలగే రెండొవ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పెదవేగి జడ్పిటిసి పెనుమాల విజయబాబును ఉండ్రాజవరం జడ్పిటిసి నందిగం భాస్కరయ్య ప్రతిపాదించగా,కుకునూరు జడ్పిటిసి కుంజా నాగేశ్వరరావు బలపరిచారు. దీంతో ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లతో కలెక్టర్ కార్తికేయ మిశ్రా గౌతమి సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా పరిషత్ సభ్యులు ప్రమాణ స్వీకారం,కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ జిల్లా లో ఎన్నికైన జడ్పిటిసి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. కో-ఆప్షన్ సబ్యులకు సంబంధించి కేవలం రెండు నామినేషన్ లు మాత్రమే దాఖలు కావడంతో వారిరువురిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించి వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.