పాదయాత్ర శివ భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : సమాజంలో ప్రతి ఒక్కరు సేవా భావం కలిగి ఉండాలని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు.మహా శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైలానికి కాలి నడకన వెళ్ళే భక్తులకు దాతల సహకారంతో జె.పాండురంగడు, జె.రాధాకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.దాతలు గత 15 సం. నుండి నందికొట్కూరు పట్టణంలో ఆత్మకూరు రోడ్డు లోని జమ్మి చెట్టు దగ్గర శివ భక్తులకు భిక్ష ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.ఈ సంవత్సరం కూడా సోమవారం 13 వ తేది నుంచి 15వ తేది వరకు 3 రోజుల పాటు శ్రీశైలానికి కాలి నడకన వెళ్ళే భక్తులకు భిక్ష ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు ఆయనే స్వయంగా భిక్ష వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం పాదయాత్రికులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో పుణ్యకార్యమన్నారు. నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు. భగవంతుని కృప వారికి ఎల్లప్పుడూ ఉండాలని అభిలాషించారు. సమాజంలో ప్రతి ఒక్కరు సేవా భావంతో ఉండాలని, తద్వారా మానవత విలువలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అల్లూరి క్రిష్ణ, బొట్టు రవి, దేశెట్టి శ్రీనివాసులు, శ్రీకాంత్ గౌడ్, ఎలక్ట్రికల్ దాత చిన్న సుబ్బడు, రంగస్వామి, జయన్న, శ్రీను సప్లయర్స్ వంట మాస్టర్ ఖాజా, తదీతరులు పాల్గొన్నారు.