వల్లూరు సబ్ ఇన్స్పెక్టర్ గా పెద్ద ఓబన్న బాధ్యతలు
1 min read
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : వల్లూరు మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బి పెద్ద ఓబన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వల్లూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న విష్ణువర్ధన్ కడప స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ కావడంతో కడప వన్ టౌన్ ఎస్సైగా ఉన్న పెద్ద ఓబన్న వల్లూరు ఎస్సైగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.