ఘనంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 61వ జయంతి
1 min read
ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పెద్ద ఎత్తున పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :మహా జననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ పుట్టినరోజు అదేవిధంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగులపల్లి పలువురు దళిత నాయకులు అది ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాశీ కృష్ణ మాదిగ రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా అయినపర్తి మాధవరావు, జిల్లా ఎంఎస్పి నాయకులు చాట్ల సాయిబాబా, ఎంఎస్పీ నాయకులు బయారపు కుటుంబరావు, ఎంఎస్పీ నాయకులు పర్సా చిన్నబాబు, ఎమ్మార్పీఎస్ ఏలూరు నగరనాయకులు సిర భరత్, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా గ్రామ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చాట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.