PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పద్మశాలీలు..ఐక్యత చాటాలి..

1 min read

ఎంపీ డా. సంజీవ్​ కుమార్​

  • కర్నూలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన భోజన మహోత్సవం

పల్లెవెలుగు, కర్నూలు:పద్మశాలీలు ఎక్కడున్నా ఐక్యతతో ఉండాలని… అప్పుడే సమస్యల పరిష్కారానికి సులువైన మార్గం ఏర్పడుతుందన్నారు కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్​ శింగరి సంజీవ్ కుమార్​. కర్నూలు నగరంలోని పెద్ద పార్క్ కిడ్స్ వరల్డ్ నందు పద్మశాలి సంఘం కర్నూలు కమిటీ అధ్యక్షుడు కస్తూరి వేమయ్య,  ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న, కోశాధికారి గుర్రం శివ ప్రసాద్​ నేతృత్వంలో కార్తీక వన భోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా శివకేశవులను ఏకం చేస్తూ.. ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎంపీ డాక్టర్​ శింగరి సంజీవ్​ కుమార్​ మాట్లాడుతూ పద్మశాలీలు అంటే ఒక కులం కాదని… ఒక కుటుంబం అని పేర్కొన్నారు. పద్మశాలిలు యువత రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా రాణించాలని సూచించారు. విద్యా,వైద్య, పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆ తరువాత  సంఘం అధ్యక్షుడు కస్తూరి వేమయ్య మాట్లాడుతూ దేశంలో పద్మశాలీలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రాబోయే రోజుల్లో  పద్మశాలిల నాయకత్వాన్ని మరింత బలపర్చుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే అభివృద్ధితో పాటు తగిన గౌరవం ఉంటుందన్నారు. మన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులుంటే సర్దుకుపోవాలన్నారు. అదేవిధంగా  సంఘం ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న మాట్లాడుతూ రాజకీయంగా పద్మశాలిలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు.

పద్మశాలి పెద్దలకు..ఘనసన్మానం:

కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా పద్మశాలీలు వివిధ రంగంలో ఉంటూ ప్రజలకు.. సంఘానికి సేవలు చేసిన  పెద్దలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.   ప్రముఖ కంటి వైద్య నిపుణులు​ డాక్టర్ ఆంజనేయులు, దాసాపతి చెన్నయ్య, కస్తూరి చిన్న రంగస్వామి, పోతుల మహాలక్ష్మి, కస్తూరి ప్రసాద్​తోపాటు మరో 20 మందిని కర్నూలు పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి.. శాలువాలు కప్పి..ఘనంగా సన్మానించారు. అనంతరం కస్తూరి ప్రసాద్​ నేతృత్వంలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పద్మశాలీ కుటుంబీకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దాదాపు 3వేల మందికి పైగా పద్మశాలీలు పాల్గొన్నారు.

About Author