NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీలో చేరిన పగడం బ్రదర్స్

1 min read

పగిడ్యాలకు చెందిన 40మంది దళితులు టీడీపీలో కి

పార్టీలోకి ఆహ్వానించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పగిడ్యాల మండలం పగిడ్యాల గ్రామంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పగడం వంశీయులు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. పగిడ్యాల టీడీపీ నాయకులు జయరామి రెడ్డి, ఆంజనేయ నగర్ టీడీపీ నాయకులు మురలయ్యల ఆధ్వర్యంలో దాదాపు 40 దళిత కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు.మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.టీడీపీ అభ్యర్ధుల గెలుపుకోసం కృషి చేయాలని అన్నారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పగిడ్యాల కు చెందిన పగడం వెంకటేశ్వర్లు, తిరుపాలు, స్వాములు, రాజు, పగడం జయరాజు, నాగరాజు, చిన్న శేషన్న, సాంబ శివుడు, అడ్డాకుల విజేయుడు ,  తలముడిపి రంగస్వామి, మరో20మంది మహిళలు టీడీపీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. కార్యక్రమంలో  టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author