శ్రీ గిరి లో అన్యమత ప్రచారం.. నిషేధం
1 min read– శ్రీశైలం ఈఓ లవన్న
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో అన్యమత ప్రచారం పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా అన్యమత ప్రచారానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇటీవల సాధువేషంలో ఉన్న కొందరు హిందూమత చిహ్నాలైన విభూతిధారణ, మాలాధారణ కలిగి ఉండడంతో పాటు అన్యమత చిహ్నం కలిగి సంచరించినట్లుగా దేవస్థానం దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఇప్పటికే సమగ్రవిచారణను చేపట్టాం. స్థానిక పోలీసు లకు కూడా ఫిర్యాదు చేయనున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతాం.. దేవస్థాన భద్రతా సిబ్బందితో సంచార తనిఖీ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ బృందం క్షేత్రపరిధిలో విస్తృతంగా పర్యటించి అవసరమైన తనిఖీలను చేపట్టడం జరుగుతుంది. నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు తనిఖీలలోగాని లేదా విచారణలో గాని తేలిన యెడల చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈఓ లవన్న స్పష్టం చేశారు.