తిరుమల పై అన్యమత గుర్తులు !
1 min read
పల్లెవెలుగువెబ్: తిరుమల కొండపై అన్యమత గుర్తులు కనబడుతున్నాయని, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తిరుమల లడ్డూలు యదేచ్ఛగా పంచారన్నారు. సీఎం జగన్ .. హిందూ సమాజంపై, సాంప్రదాయాలపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. అన్యమతస్థుడైన జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలన్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు సతీసమేతంగా వెళ్లాలని, హిందువుల మనోభావాల్ని, దేవాలయాలను కాపాడాలన్నారు.