NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భార‌త్ లోకి పాక్ డ్రోన్.. కూల్చేసిన పోలీసులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ నుంచి భారత దేశంలో ప్రవేశించబోతున్న ఓ డ్రోన్‌ను ఆదివారం ఉదయం జమ్మూ-కశ్మీరులోని కథువా జిల్లా, హీరానగర్ సెక్టర్‌, అంతర్జాతీయ సరిహద్దుల్లో కూల్చేసినట్లు పోలీసులు తెలిపారు. టల్లి హరియా చక్ ప్రాంతంలో దీనిని కూల్చేసినట్లు తెలిపారు. అడిష‌న‌ల్ పోలీసు డైరెక్టర్ జనరల్ ముఖేశ్ సింగ్ మాట్లాడుతూ కథువా జిల్లాలోని రాజ్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో టల్లి హరియా చక్ ప్రాంతంలో డ్రోన్ సంచరిస్తున్నట్లు సెర్చ్ పార్టీ గుర్తించిందని చెప్పారు. సరిహద్దుల అవ‌తలి నుంచి (పాకిస్థాన్ నుంచి) వస్తున్న ఈ డ్రోన్‌ను కూల్చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉదయం పోలీసు సెర్చ్ పార్టీ విధులను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ డ్రోన్‌లో బాంబులు, ఆయుధాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు బాంబు డిస్పోజల్ నిపుణులు పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనిలో మూడు ప్యాకెట్లు ఉన్నట్లు గమనించామన్నారు.

                                             

About Author