భారత్ టూ ఆప్ఘానిస్తాన్.. వయా పాకిస్థాన్: రూట్ క్లియర్
1 min read
పల్లెవెలుగు వెబ్: ఆప్ఘానిస్తాన్ తాలిబన్ చేతుల్లోకి వెళ్లాక అక్కడ దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకు తినడానికి తిండి దొరక్క అల్లాడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆప్ఘాన్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో భారత్ కూడా సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను ఆప్ఘాన్‌కు తరలించడానికి 500 లారీలను సిద్ధం చేసింది. అయితే ఈ లారీలు పాకిస్తాన్ గుండా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పదంతో భారత్‌కు చెందిన లారీలను ఆప్ఘానిస్తాన్‌కు వెళ్లేందుకు అనుమతించింది.