పాక్ ప్రధాని.. నాకు పెద్దన్న !
1 min readపల్లెవెలుగు వెబ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్నయ్య లాంటివారని నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజకీయంగా బీజేపీ తీవ్రమైన విమర్శలు చేసింది. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సిద్ధు శనివారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనకు ఇమ్రాన్ తరఫున.. ఇరు దేశాల సరిహద్దు వద్ద కార్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సీఈవో మహమ్మద్ లతీఫ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్ధూ ఆయనతో ‘‘ఇమ్రాన్ అంటే నాకు ఎంతో గౌరవం. చాలా అభిమానిస్తాను. నాకు ఆయన పెద్దన్నయ్య వంటివాడు’’ అని అన్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్.. ఐఎస్, బోకో హరాం వంటి తీవ్రవాద సంస్థలను హిందుత్వంలో చూస్తోందని ఆరోపించింది. హిందూత్వాన్ని విమర్శిస్తున్న రాహుల్తోసహా పలువురు కాంగ్రెస్ నేతలతో సిద్ధూ వ్యాఖ్యలు ముడిపడి ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర పేర్కొన్నారు.
ReplyForward |