పాక్ గెలుపు .. భారత్ లో సంబరాలు !
1 min read
Cricket ball resting on a cricket bat on green grass of cricket pitch
పల్లెవెలుగు వెబ్: ఇటీవల జరిగిన భారత – పాక్ టీ20 క్రికెట్ మ్యాచ్ లో పాక్ గెలిచింది. పాక్ గెలుపును ఆస్వాదిస్తూ జమ్మూ కశ్మీర్ లో కొందరు వైద్య విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకున్న విద్యార్థులపై పోలీసులు రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. పాక్ విజయం పై కశ్మీర్ లోయలో పలువురు సంబరాలు చేసుకున్న వీడియలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మానవత దృక్పథంతో విద్యార్థుల పై మోపిన ఉపా కేసులు రద్దు చేసుకోవాలని జమ్మూకశ్మీర్ విద్యార్థి సంఘం గవర్నర్ ను కోరింది.