NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాకిస్థాన్ కూడ ఐటీ దిగ్గ‌జ‌మే.. జైశంక‌ర్ సెటైర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: పదవీబాధ్యతలతో ఎప్పుడూ సీరియస్ గా ఉండే భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ పాకిస్థాన్ విషయంలో అదిరిపోయే సెటైర్ వేశారు. పాకిస్థాన్ కూడా ‘ఐటీ’ దిగ్గజమేనని వ్యంగ్యం ప్రదర్శించారు. గుజరాత్ లోని వడోదరలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ “మనకో పొరుగుదేశం ఉంది. మనం ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఎలా దిగ్గజాలుగా పేరుపొందామో, వారు కూడా ఓ ఐటీ (ఇంటర్నేషనల్ టెర్రరిజం)లో దిట్టలు అనిపించుకున్నారు. ఇది ఇప్పటిది కాదు.. ఏళ్ల తరబడి భారత్ ఎదుర్కొంటున్న సమస్య. అయితే అది టెర్రరిజం అని, దాని ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని మనం తక్కిన ప్రపంచానికి వివరిస్తున్నాం. ఇవాళ మేం టెర్రిరజం బారినపడ్డాం… రేపు అది మీకు ఎదురుకావొచ్చు” అని జై శంకర్ వివరించారు.

                                              

About Author