పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ భూభాగమే !
1 min readపల్లెవెలుగువెబ్ : పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో భూభాగమేనని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 1994 పార్లమెంటు తీర్మానాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక రోజు పర్యటన కోసం ఆదివారంనాడు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పాక్ ఆక్రమణలో పీఓకే ఉన్నప్పటికీ ఒక్క కుటుంబం కూడా నష్టపోనీయమని, దేశ అభివృద్ధిలో వారు గణనీయమైన పాత్ర పోషించారని చెప్పారు.