సింధూర్ తో భారత సైన్యం సత్తా పాకిస్తాన్ కి అర్ధమైంది
1 min read
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్
మాజీ సైనికులకు శాలువా కప్పి ఘన సన్మానం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన భారత సైన్యం సత్తా ఏమిటో పాకిస్తాన్ కు అర్థమైందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత సైన్యాన్ని కీర్తిస్తూ దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన తిరంగా ర్యాలీకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఉగ్రవాదుల ఏరివేత చేపట్టిన భారత సైన్యానికి యావత్తు దేశ ప్రజలు మద్దతుగా నిలిచారని తెలిపారు. యుద్ధభూమిలో వీర మరణం పొందిన మురళీనాయక్ దేశభక్తిని చాటి చెప్పి, ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎంపీ పేర్కొన్నారు. తిరంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ సైనికులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి శాలువాలు కప్పి సన్మానించరు.
