PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబు షూరిటీ ,భవిష్యత్తు గ్యారెంటీ  కార్యక్రమంలో పాలకుర్తి తిక్కారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో బాబు  షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం శుక్రవారం మంత్రాలయం ఇంఛార్జి తిక్క రెడ్డి నిర్వహించారు.శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల కురుక్షేత్రంలో జనసేన టిడిపి పొత్తులతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, బాబు షురిటి భవిష్యత్ గ్యారెంటీ  చేసిన ప్రతి హామీలను నెరవేర్చి విధంగా బాబు గ్యారెంటీ ప్రతి ఇంటికి షూరిటీ కరపత్రం ఇవ్వడం జరుగుతుందని అందులో ఆరు హామీలు మహిళకు ఉచిత బస్సు,సంవత్సరానికి మూడు సిలిండర్లు,రైతులకు సంవత్సరానికి పెట్టుబడుకు నగదు,నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు,వంటి కార్యక్రమంలో బాబు షూరిటీ  లో ప్రజలకు చేరవేయడం జరుగుతుందని అన్నారు.ప్రజలందరూ ఆశీస్సులతో ఈ ఒక్క సారి నాకు అవకాశం కల్పించండి అంటూ గ్రామాల్లో ఆయన కార్యకర్తలకు గ్రామ ప్రజలకు తెలియజేశాడు.ఈ కార్యక్రమంలో  వెంకటపతి రాజు,కొట్రేష్ గౌడ్,కురుగోడు,సిద్దు,డాక్టర్ రాజానంద్,సోమన్న,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author