NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వామి అమ్మవార్లకు పల్లకోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూల నక్షత్రం రోజులలో సర్కారి సేవగా జరిపించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడింది. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడుతాయి. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం నిర్వహించబడింది. అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ పల్లకీ ఉత్సవపూజలు నిర్వహించారు అని ఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author