వీరభద్రాలయంలో ఘనంగా పల్లకోత్సవం
1 min read
పల్లెవెలుగువెబ్, రాయచోటి: రాయచోటిలో దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రాలయం నందు సోమవారం పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు . ఉదయం శ్రీ వీరభద్రస్వామివారికి, శ్రీ అఘోర లింగేశ్వర స్వామివారికి పంచామృత రుద్రాభిషేకం, అనంతరం అష్టోత్తర పూజలు నిర్వహించి, పాల్గన్న భలందరికీ మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేయడమైనది. సాయంత్రం శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పరిమళభరిత పుష్పాలత సర్వాంగ సుందరంగా అలంకరించి, విశేషపజలు చేసి పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ పూజలలో స్థానిక, కన్నడభక్తులు పాల్గొన్నట్లు ఆలయ ఈ ఓ. శ్రీమతి మంజుల తెలియజేశారు.