పల్లెల్లో వెలుగొందుతున్న ‘పల్లెవెలుగు’దినపత్రిక
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా దినపత్రికలు పనిచేస్తున్నాయని ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి మరియు తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబు అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సర-2024 పల్లెవెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఎంపీడీఓ,తహసిల్దార్, ఈఓఆర్డి ఫక్రుద్దీన్,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్,చౌటుకూరు పశువైద్య అధికారి చంద్రమోహన్ పల్లెవెలుగు మండల పాత్రికేయులు స్వాములు కలిసి వారు ప్రారంభించారు.ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియపరచాలన్నా.. ప్రభుత్వం పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు మరి ఏవైనా సరే ప్రజలకు తెలియాలంటే మీడియా కీలకమని అధికారులు అన్నారు.పల్లెవెలుగు దిన పత్రికలో ప్రజలకు ఉన్న విషయాలను చేరవేస్తూ దినపత్రిక ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని వారు కొనియాడారు.