NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షునిగా పామర్తి విట్టల్ ఏకగ్రీవం

1 min read

క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ  ప్రసాద్

పెద్ద ఎత్తున పాల్గొన్న ఓబీసీ, బీసీ సంఘ నాయకులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు   : APBC, OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు  S. P. R విఠల్ కుమార్ రిటైర్డ్ అయినందునా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి పామర్తి ఏసురాజు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఏలూరు జిల్లా క్యాలెండరు ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నూతన అధ్యక్షులు పామర్తి ఏసురాజు కి జడ్పీ ఛైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్  శాలువాతో సన్మానించారు. APBC,OBC ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యత్వ QR కోడ్ ను ఛైర్పర్సన్ పద్మ  ప్రసాద్  ఆవిష్కరించారు. ఈ సందర్బంగా bc ఎంప్లాయిస్ అందరు ఛైర్పర్సన్ వారికీ కృతజ్ఞత తెలియచేసారు.ఈ కార్యక్రమంలో S. P. R విఠల్ కుమార్,కార్పొరేటర్ కలవకొల్లు సాంబ, ఉక్కుసూరి గోపాలకృష్ణ, విజయ్ కుమార్, mv సుబ్బారావు, avn శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About Author