పాన్-ఆధార్ లింక్.. గడువు పెంపు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆధార్ తో పాన్ కార్డ్ అనుసంధాన గడువు మరోసారి కేంద్ర ప్రభుత్వం పెంచింది. మార్చి 2022 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోన కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు సెప్టంబర్ 30, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్టు సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా ప్రొహిబేషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ – 1988 కింద నోటీసులు , ఆదేశాల జారీకి గడువు సైతం మార్చి 2022 వరకు పొడిగించారు.