పంచలింగాల చెక్ పోస్టు ఆకస్మిక తనిఖీ
1 min readజిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ .
జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి
అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఉంచాలి
ప్రతి వాహానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టులలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ తెలిపారు. ఈ సంధర్బంగా శనివారం కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లా సరిహద్దు – పంచలింగాల చెక్ పోస్టును జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు.మద్యం , డబ్బు తరలించే వాహనాలను గుర్తించే విధంగా ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు అక్రమ రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు.చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పలు సూచనలు, సలహాలు చేశారు. సీసీ కెమెరాలు, గట్టి ఫోర్సు ను ఏర్పాటు చేసి బాగా మానిటరింగ్ చేయాలన్నారు. చెక్ పోస్టులలో 24 గంటలు తనిఖీలు నిర్వహించాలన్నారు. వాహనాల తనిఖీల విరామం లేకుండా రెగ్యులర్‌గా సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతున్నాయా అనేది ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద అనుబంధ శాఖల సమన్వయంతో బాగా పని చేయాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ నాగరాజు, కర్నూలు పట్టణ డిఎస్పీ విజయశేఖర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి, కర్నూలు తాలుకా ఇంచార్జ్ సిఐ కిరణ్ కుమార్ రెడ్డి , సెబ్ AES రాజశేఖర్ గౌడ్, కర్నూలు తాలుకా ఎస్సైలు ఉన్నారు.