సమ్మె నోటీసు ఇచ్చిన పంచాయతీ శాఖ ఉద్యోగులు
1 min readపల్లెవెలువెబ్ : ఏపీలో గ్రామ పంచాయతీ శాఖ ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర గ్రామ పంచాయతీ శాఖ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులో 9 ప్రధాన సమస్యలను ప్రస్తావించిన ఉద్యోగుల సంఘం… వాటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో అక్టోబర్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఉద్యోగులకు ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరిన ఉద్యోగుల సంఘం.. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం ఇవ్వాలని కోరింది. కనీస వేతనంగా రూ.20 వేలను చెల్లించాలని డిమాండ్ చేసింది.