NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

60 ఏళ్ల తరువాత ఆ గ్రామంలో ఎన్నికలు

1 min read


పల్లెవెలుగువెబ్: కర్నూలు జిల్లాలో అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ గత ఆరు దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రామస్తులంతా చర్చించి సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామస్తులు.
ఈ సంప్రదాయం గత ఆరు దశాబ్దాలుగా కొనసాగింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లక్ష్మిదేవి ఇటీవల కన్నుమూశారు. దీంతో ఖాళీ అయిన సర్పంచ్ పదవి కోసం గ్రామంలో రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2,375 మంది ఓటర్లు ఉన్న లక్కసాగరంలో నిన్న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

About Author