పంచాయతీ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలి
1 min readవినతి పత్రంతో అడిషనల్ కమిషనర్ ని కలిసిన ఏఐటీయూసీ నాయకులు
ఉన్నతాధికారులకు ఆదేశాలు అందిస్తాం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు నగరపాలక సంస్థలో విలీనమైన ఏడు గ్రామపంచాయతీలకు చెందిన ఉద్యోగ సిబ్బందికి, బకాయిపడిన 2022 జూన్ నెల వేతనంలో గతంలో చెల్లించిన ది మినహా మిగిలిన 50 లక్షల రూపాయలు వేతనం 2024 మార్చిలో చెల్లిస్తామని అడిషనల్ కమిషనర్ ఏఐటీయూసీ నాయకులకు తెలిపారు. ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి మరియు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు యూనియన్ సహాయ కార్యదర్శి ఎస్ఎం వి సుబ్బారావు అడిషనల్ కమిషన్ కలిసి ఉద్యోగ సిబ్బంది సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వినతి పత్రంపై అడిషనల్ కమిషనర్ స్పందిస్తూ ఉద్యోగ సిబ్బంది బకాయి వేతనాలు డిసెంబర్ జనవరి మాసాలలో మున్సిపల్ కార్మికులు సమ్మె సందర్భంగా సంక్రాంతి పండక్కి ప్రభుత్వం ప్రకటించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున 1000 మందికి 10 లక్షల రూపాయలు మార్చి నెల లో చెల్లిస్తామని తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థలో అర్హత ఉన్న ఉద్యోగ సిబ్బందికి ప్రమోషన్స్ ఇవ్వాలని యూనియన్ నాయకు లు కోరగా ఖాళీగా ఉన్న పోస్టులలో అర్హత కలిగిన ఉద్యోగ సిబ్బందికి ప్రమోషన్స్ ఇస్తామని అడిషనల్ కమిషనర్ తెలిపారు. కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఏడుగురు ఎన్ ఎమ్ ఆర్ లకు ప్రతినెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. యూనియన్ సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్న ఇతర అంశాలను తమ పరిధిలో ఉన్నవి పరిశీలిస్తామని, ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తామని ఆయన ఏఐటియుసి నాయకులకు తెలిపారు.