హోరా హోరిగా పెరిగిన పంచాయతీ ఆదాయం!
1 min read– పంచాయతీ వేలంపాటలో మాట్లాడుతున్న డీఎల్పీఓ నూర్జహాన్
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ పాల్ దినకర్,ఉప సర్పంచ్ సక్రి తిక్కయ్య,అద్యక్షతన, డిఎల్పివో నూర్జహాన్,సెక్రెటరీ నాగరాజు,పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి గాను పంచాయతీ వేలాలు నిర్వహించారు. ఈ వేలం పాటలో గత ఏడాది కంటే ఈ ఏడాది పంచాయతీ ఆదాయం 1,86,000వేలు పెరిగింది.దినసరి సంత18500, లకు వడ్డే గురురాజా,కమేళ 34,000 లకు ఈడిగ వసంత బండి మెట్ట 4,250,00 లకు ఈడిగ వసంత,వేలం పాటలో దక్కించుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 1,86,000 అధికంగా వచ్చినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.వేలం పాట లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌతాళం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి,సిబ్బంది తో కలిసి గట్టి బందోబస్తు నిర్వహించారు.