PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృష్ణాజిల్లా పంచాయతీ అధికారి అవినీతిపై నివేదిక కోరిన రాష్ట్ర లోకాయుక్త

1 min read

పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: కృష్ణా జిల్లాలో నూతనంగా ఏర్పాటు కాబడిన ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ కు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా డి ఎల్ పి ఓ కార్యాలయాన్ని సెప్టెంబర్ 2022 లో ఏర్పాటుచేసి ఆరోపణలు రావడంతో అక్టోబర్ 2022లో రద్దు చేసిన విషయంపై జిల్లా పంచాయతీ అధికారి ఎస్ .వి. నాగేశ్వరరావు పై ఉన్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ను నివేదిక కోరుతూ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఉయ్యూరులో 8-9-2022న అప్పటి కలెక్టర్ పి రంజిత్ భాషాపేరుతో నూతన డిఎల్పిఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ కాబడ్డాయి. ఆ డి ఎల్ పి ఓ కార్యాలయాన్ని ఉయ్యూరులో కాకుండా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయడంపై సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. డి ఎల్ పి ఓడిఎల్పిఓ కార్యాలయం ఏర్పాటులో జరిగిన అవినీతిపై ఉయ్యూరు కు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ది. 27- 12 -2023న రాష్ట్ర లోకాయుక్త కు ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా  కృష్ణాజిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఉయ్యూరు నూతన రెవిన్యూ డివిజన్. లో 7 మండలాల కొరకు నూతన డివిజనల్ పంచాయతీ అధికారి ఎస్ .వి. నాగేశ్వరరావు నాయక్ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయాన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందని ,ప్రభుత్వ అనుమతి లేకుండా అవినీతికి పాల్పడి ఉయ్యూరులో డీఎల్పిఓ కార్యాలయం ఏర్పాటు చేసి రద్దు చేయడం జరిగిందని ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి ఎస్. వి. నాగేశ్వర నాయక్  కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోగలందులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ,సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

About Author