ముగిసిన పంచాయతీ కార్యదర్శుల శిక్షణ తరగతులు..
1 min read
ఉపాధి హామీ తదితర అంశాల పై కార్యదర్శుల శిక్షణ..
సంక్షేమ కార్యక్రమాల అమలులో కార్యదర్శులు మానవనియ కోణంలో పనిచేయాలి..జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పంచాయతీ కార్యదర్సుల శిక్షణ కార్యక్రమాలు ఎటువంటి సమస్యలు లేకుండా ముగిసాయని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. సందర్బంగా కార్యదర్సుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో కార్యదర్సులను ఉద్దేధించి డిపిఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలులో మానవీయకోణం ఉండాలని అన్నారు. గత నెల రోజుల నుండి జిల్లాలో 858 మంది పంచాయతీ కార్యదర్సులకు 5 విడతలగా ఒకొక్క కార్యదర్శికి 6 రోజులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించమన్నారు. శిక్షణ తరగతులలో కార్యదర్సులకు పంచాయతీ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు, అక్రమ నిర్మాణాలు, సర్వీస్ నిబంధనలు, విద్యా , వైద్యం, పంచాయతీ రికార్డులు నిర్వహణ, గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ, సమాచార హక్కు, ఉపాధి హామీ అమలు తదితర అంశాలపై కార్యదర్సులకు శిక్షణ ఇచ్చామని డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. శిక్షణ తరగతులలో ఏలూరు జిల్లా నుండి 484 మంది, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 374 మంది కార్యదర్సులు హాజరు అయ్యారని అన్నారు. ప్రభుత్వం జిల్లాకు 30 లక్షల విడుదల చేసిందని, ఒక్కొక కార్యదర్శికి 6500 ఖర్చు చేసి శిక్షణ ఇచ్చామన్నారు. నాలుగు కేంద్రాలలో శిక్షణ తరగతులు నిర్వహించి కార్యదర్సులు అందరికి ఉచితంగా భోజనం, వసతి కల్పించామన్నారు. గత నెలరోజులుగా జరిగిన కార్యదర్సుల శిక్షణ తరగతులలో ఎటువంటి సమస్యలు తలత్తలేదని డిపిఓ అన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జె. మురళి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ , జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి, కోర్సు పరిశీలకులు దోసిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ రవి కుమార్ సహకారం అందించారని డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శిక్షణ తరగతుల పూర్తి చేసిన కార్యదర్సులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందన్నారు.