పని ఒత్తిడితో పంచాయితీ కార్యదర్శుల ఆందోళన..
1 min read
-ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నామని ఆవేదన..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు: వివిధ సర్వేలు మాకు అప్పగించడం వల్ల మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్వేల నుండి మాకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మిడుతూరు మండల పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పి దశరథ రామయ్యకు మరియు ఈఓఆర్డి సంజన్నకు పీఎస్ లు వినతిపత్రం అందజేశారు.ఇంటి మరియు కుళాయి పన్నుల వసూలు,స్వచ్ఛ భారత్ మరియు వివిధ రకాల సర్వేలు చేయాలని ఆదేశాలు ఇస్తున్నారని తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నామని మాకు పని బారాన్ని తగ్గించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి గ్రామాల్లో నీటి సమస్య ఎద్దడి తలెత్తకుండా మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కావునా మాకు సర్వేల నుండి విముక్తి చేయాలని అధిక పనుల వల్ల ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.ఈ విషయం ఉన్నతాధికారులకు పంపుతామని ఎంపీడీవో వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్,పవన్ కుమార్,బి శివకళ్యాణ్ సింగ్, షేక్షావలి,ఎన్ అనురాధ,పవన్, ఫరీద్,రఘు,కేశావతి పాల్గొన్నారు.