పాణ్యం నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం
1 min read– అడుగడుగునా మహిళలు హారతులు… యువత కేరింతలు
– యువనేత లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 89వరోజు పాణ్యం అసెంబ్లీ నియోజవర్గంలో దుమ్మురేపింది. పాదయాత్ర పొడవునా అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడుతూ యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. రోడ్లవెంట యువనేత రాకకోసం మహిళలు, వృద్ధులు, యువకులు వేచిచూశారు. యువకులు బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ నినాదాలు చేశారు. రేమడూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర… పుసులూరు, బొల్లవరం, బస్తిపాడు, చినకొట్టాల మీదుగా పెదకొట్టాలకు చేరుకుంది. వాల్మీకి బోయలు, ఎస్సీలు, ఆయా గ్రామాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. బొల్లవరంలో మహిళలతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకలు విన్నారు. బొల్లవరం శివార్లలో కౌలురైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పి యువనేత ముందుకు సాగారు. 89వరోజున యువనేత లోకేష్ 11.9 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1147.5 కి.మీ పూర్తిచేసుకొంది.