జిల్లా కలెక్టర్ ని కలిసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు, కర్నూలు: “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ” కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్ మండలం : పాలకొలను గ్రామంలో ప్రభుత్వ భూమి ఇళ్ల స్థలాలకు అనువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ చేస్తే క్రిమినల్ కేసులుపెడతాం అని బోర్డు పెట్టడం జరిగింది.. కూటమి ప్రభుత్వం వచ్చాక బోర్డును పక్కకు తీసేశారు పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లిన చర్యలు శూన్యం..ఒకవైపు DRDO మరోవైపు డ్రోన్ కంపెనీ ఉన్న కాస్త భూమి భవిష్యత్తు అవసరాల కోసం 320 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన వారికి స్థలాలు చూపి చట్ట ప్రకారం కాళీ చేయించి, సాగు ద్వారా వచ్చిన మూలధనం పంచాయతీ ఖాతాలో వేయమనీ కోరడం జరిగింది.. అక్రమణాలు తొలగించి చట్టం అందరికీ ఒకేలా పనిచేసేలా చూడాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది… అనంతరం కల్లూరు మండలం : మార్కాపురం గ్రామంలో రేషన్ పంపిణీ టిడిపి నాయకుడు రామాంజనేయులు తన నివాసంలో రేషన్ పంపిణీ చేస్తున్నాడు.. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు… బదులుగా సచివాలయం వంటి బహిరంగ ప్రదేశాల్లో లేదా మరేదైనా సాధారణ ప్రదేశాల్లో రేషన్ పంపిణీ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి మరియు కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పాలకొలను రమేష్ పాల్గొన్నారు.