పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరు చరిత రెడ్డి ఖరారు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: వచ్చే ఎన్నికలలో పాణ్యం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరు చరిత రెడ్డి పేరును టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించారు గత ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అధినేత అభయమిచ్చి మళ్ళీ ఒకసారి టిడిపి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉంటూ నియోజకవర్గం పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ తనదైన శైలిలో గౌరు చరితారెడ్డి గౌరు వెంకటరెడ్డి పార్టీ క్యాడర్ ను కాపాడుకున్నారు అందుకు ప్రతిఫలంగానే ఈరోజు అభ్యర్థతం ఖరార్ అయింది ఇక చరిత్రలోకి వెళితే కుటుంబ వివరాలు రాజకీయ ప్రస్థానం మొదలైన విధానంపై ప్రత్యేక స్టోరీ..గౌరు చరిత రెడ్డి… 1971 ఆగస్టు 4వ తేదీ కొణిదెల గ్రామంలో మల్లారెడ్డి బాలనాగమ్మ దంపతులకు గౌరు చరిత రెడ్డి జన్మించారు. జీవిత భాగస్వామి గౌరు వెంకట్ రెడ్డి . సంతానం గౌరు జనార్దన్ రెడ్డి గౌరు చిద్విల రెడ్డి
రాజకీయ జీవితం…
గౌరు చరితా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందికొట్కూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైరెడ్డి రాజశేఖరరెడ్డి పై 13488 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం 2009లో నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో పోటీకి దూరంగా ఉన్నారు 2010లో వైఎస్ మరణానంతరం జగన్ కు మద్దతుగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి పై 11647 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంతరం వైసిపి పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోవడంతో ఇమడలేక రాజకీయ సమీకరణలో భాగంగా .గౌరు చరితారెడ్డి తన భర్త గౌరు వెంకట రెడ్డితో కలిస్ మార్చి 9, 2019న తెలుగుదేశం పార్టీలో చేరారు.2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పాణ్యం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి పై 43857 ఓట్ల తేడాతో ఓడిపోయారు అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో వైసిపి పార్టీ అధికారంలో రావడం ప్రతిపక్షానికే పరిమితమైన గౌరు దంపతులు పార్టీ క్యాడర్ ని తమ ఉనికి కోల్పోకుండా చురుకుగా రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో గౌరు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని గెలిపించుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు పన్ని సఫలమయ్యారు ఓర్వకలు లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తుండడంతో అధినేత చంద్రబాబు నాయుడు భుజం తట్టి బాగా పనిచేస్తున్నారని ఆనాడే పాణ్యం టికెట్ గౌరు చరిత రెడ్డికి రిజర్వ్ చేశారని హామీ ఇచ్చారని గౌరు వర్గం పేర్కొంది. మొత్తానికి టిడిపి టికెట్ ఖాయం కావడంతో గౌరు వర్గం ఎన్నికల బరిలో ప్రత్యేక కార్యచరణతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం అయింది .