పాణ్యం వైసిపి టికెట్ నాదే.. గాలి వార్తలు నమ్మవద్దు
1 min read– గ్రామ సారధులు వాలంటీర్లు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన (చేసిన) అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి….పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రభుత్వం ప్రజలకు అందించిన నవరత్నాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గ్రామ సారథులు వాలంటీర్లకు మా నమ్మకం నువ్వే జగన్ అనే గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం నాడు మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి పాఠశాల సమావేశ మందిరంలో మండల కన్వీనర్ ఇన్చార్జి నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హాజరై ప్రసంగించారు ప్రతి ఇంటికి జగనన్న అందించిన సంక్షేమ పాలన గురించి వివరించి వారి అనుమతి తీసుకొని మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికి పంచాలని ఆదేశించారు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో వైసిపి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గా పాలన సాగించేలా ప్రతీ కార్యకర్త నాయకులు కృషి చేయాలన్నారు నా నియోజకవర్గంలో రైతులకు మొదటి ప్రాధాన్యతగా కేసీ కెనాల్ నీటి విడుదల కోసం అలగనూరు మరమ్మత్తుల గురైతే సమాంతర కాలువ ఏర్పాటు చేసి కేసీ కెనాల్ కు నీరు నిరంతరం వచ్చేలా రైతుల కోసం కృషి చేశామని కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు పదవులు పంచామని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని యాజమాన్యాలతో నిరంతరం మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేశానన్నారు పరిశ్రమలలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరమైన పరిహారం అందించామన్నారు గత టిడిపి ప్రభుత్వ హయాంలో పింఛన్లు కోసం పించన్ దారులు పంచాయతీ కార్యాలల వద్ద రోజుల తరబడి నిరీక్షించే వారని . వైసీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు తెల్లారకముందే ఒకటో తేదీ ఇంటి వద్ద పింఛన్లు ఇచ్చి పింఛన్ దారుల కళ్ళలో ఆనందం నింపారని కరోనా సమయంలో వాలంటీర్ల చేసిన సేవకు కృషి అభినందనీయమన్నారు. పాణ్యం నియోజకవర్గం నాదే కష్టమొచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని వచ్చే ఎన్నికలలో కూడా తన భారీ మెజార్టీతో గెలిపించాలని టికెట్ పై అపోహలు వద్దన్నారు అధిష్టానం పాణ్యం నియోజకవర్గ టికెట్ నాకే కేటాయిస్తుందని గాలి వార్తలు గాలి కబుర్లు నమ్మొద్దు అన్నారు ఇప్పటినుంచే ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు జగన్ సైన్యంలా పనిచేయాలన్నారు వైసిపి కోసం పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు నంద్యాల జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి వాలంటీర్ మొబైల్లో ప్రత్యేకంగా రూపొందించిన జగన్ సేవాదళ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కష్టపడి పని చేసే గ్రామ సారధులకు కన్వీనర్లకు పార్టీ తరఫున బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి పథకాలే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయ్యేలా పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడాలని వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండి భారీ మెజార్టీతో కాటసాని రాంభూపాల్ రెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రివర్గంలో చోటు దక్కించుకునేలా అందరూ కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి .. వై శివానందరెడ్డి.. సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. . వెంకటకృష్ణారెడ్డి. ఎల్లారెడ్డి.. బీఎస్ రామ్మోహన్ రెడ్డి ..ఆర్ బి కే మండల చైర్మన్ పుల్లయ్య .. మేఘనాథ్ రెడ్డి.. రఘు మాధవరెడ్డి.. కో ఆప్షన్ మెంబర్ హుస్సేన్ భాష.. బాలచెన్ని. సివి రమణయ్య. మాలిక్ భాషా. ఐసాని సునీల్ కుమార్ రెడ్డి.. నంద్యాల వెంకటేశ్వర్లు.