NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌ట్టాలు ఇచ్చారు.. ఉద్యోగాలు లేవు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిగ్రీ పట్టాలు ఇచ్చారు కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదని యోగివేమ‌న యూనివ‌ర్శిటీ విద్యార్థులు.. మంత్రి ఆదిమూల‌పు సురేష్ ను ప్ర‌శ్నించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పుడు ఇస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యూనివ‌ర్శిటీ విద్యార్థులు నిల‌దీశారు. శుక్రవారం వై వి యు స్నాతకోత్సవం లో పట్టాలు ప్రదానం చేయడానికి విచ్చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వి. గంగా సురేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందుకోసం ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి .. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రకటించలేదని అన్నారు. డిగ్రీలు పూర్తి చేసుకొని.. అప్పు చేసి మరీ కోచింగ్ కు వెళ్లి.. గత మూడు సంవత్సరాలుగా పుస్తకాల పురుగులు అయిన వారి ఆశలు నిరాశలు అవుతున్నాయని వాపోయారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

                            

About Author