PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్యాపిలిలో.. రూ9.68 కోట్లతో అభివృద్ధి పనులు

1 min read

ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్​ రెడ్డి  

ప్యాపిలి, పల్లెవెలుగు:డోన్​ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో రూ.9.68 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.  ప్యాపిలిలోని పీఆర్ పల్లిలో రూ.83.14 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ భవనాలను శుక్రవారం మంత్రి బుగ్గన ప్రారంభించారు. రూ.38.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, రూ.23.84 లక్షలతో తీర్చిదిద్దిన డాక్టర్ వైఎస్ఆర్ రైతుభరోసా  కేంద్రం, రూ.20.80 లక్షలతో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లకు సంబంధించిన పైలాన్ లను ఆయన ఆవిష్కరించారు. పీఆర్ పల్లి (పాయసం రంగారెడ్డి పల్లి) గ్రామంలో గుడిపాడు నుంచి పీఆర్ పల్లి వరకూ నిర్మించిన రూ.3.4 కోట్లతో రహదారిని గ్రామస్థులతో కలిసి అట్టహాసంగా మంత్రి ప్రారంభించారు. అనంతరం కోటి రూపాయలతో కోన ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి గుట్టలపల్లి వరకూ వేసిన రోడ్డును మంత్రి బుగ్గన ప్రారంభించారు.  అదేవిధంగా శ్రీ కంబగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో రూ.కోటితో ఆలయ ప్రాంగణంలో తీర్చిదిద్దిన అంతర్గత సీసీ రోడ్లకు సంబంధించిన పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆలయానికి వచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కంబగిరి స్వామిని మంత్రి బుగ్గన దర్శించుకున్నారు.

సీతమ్మ తండాలో.. సీసీ రోడ్లు

అనంతరం సీతమ్మతాండలో పర్యటించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు తండా వాసులు స్వాగత సత్కారాలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో రూ.18 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రహదారుల పనులకు సంబంధించిన పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత బూరుగల గ్రామంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటించారు. మొత్తం రూ.1.27 కోట్లకు సంబంధించిన పనులను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.

బూరుగలలో… అభివృద్ధి పనులు..

బూరుగల గ్రామంలో రూ.23.94 లక్షలతో  ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ రైతుభరోసా కేంద్రం, రూ.38.4 లక్షలతో తీర్చిదిద్దిన సచివాలయ భవనం, రూ.77 లక్షలతో గ్రామంలోని అంతర్గత సీసీ రహదారులు, రూ.8 లక్షలతో అభివృద్ధి చేసిన బూరుగల ఊరు వాకిలి పనులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి  రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు,మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి ,బొర్రా మల్లికార్జున రెడ్డి , గడ్డం భువనేశ్వర్ రెడ్డి,బోరెడ్డి పుల్లారెడ్డి,బోరెడ్డిw రాము , కమతం భాస్కర్ రెడ్డి , రాజమురళి , శ్యామ్ రెడ్డి , తులసి రెడ్డి , జలదుర్గం రసూల్ , జమాల్ , దస్తగిరి , శ్రీనివాసులు ,మర్రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,పుల్లారెడ్డి,విష్ణు,  ప్యాపిలి మండల వైసీపీ నాయకులు,సంబంధిత అధికారులు, ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

About Author