ప్యాపిలీ జీపీకి.. పెరిగిన ఆదాయం
1 min readపల్లెవెలుగు వెబ్, ప్యాపిలి: వేలం పాటల్లో గ్రామపంచాయతీ కి ఈసారి భారీగా ఆదాయం సమకూరింది. ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీ పరిధిలోని బస్టాండ్, దినసారి, వారపు సంత, జంతువధశాలకు వేలం నిర్వహించారు. సర్పంచ్ సి.లక్ష్మీ దేవి , ఉపసర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి వైఎస్సార్ సీనియర్ నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈఓఆర్డీ వెంకటరెడ్డి వేలం పాటలు నిర్వహించారు .పట్టణానికి చెందిన ఆరుగురు డిపాజిట్ చెల్లించి వేలం లో పాల్గొన్నారు .7.5లక్షలు సర్కారు పాటగా నిర్ణయించారు. పాటాదారులు ఆసక్తి చూపకపోవడంతో సర్కారు పాటక్రమంగా తగ్గుతూ వచ్చింది .దీంతో 7.10లక్షలకు రాజానారాయణ మూర్తి పాట మొదలు పెట్టారు. బొరెడ్డి రఘునాథ్ రెడ్డి 7.20 లక్షల కు పాడగా ,రాజా నారాయణ మూర్తి7.25లక్షలకు పాడారు. బోరెడ్డి రఘనాథ్ రెడ్డి 7.26లక్షలకు పాడగా చివరకు రాజా నారాయణ మూర్తి 7.30లక్షలకు పాట దక్కించుకున్నారు .గత ఏడాది కరోనా కారణంగా పాటదారులు ఆసక్తి చూపకపోవడంతో3లక్షల కు వేలం పాడారు. ఈసారి పంచాయతీ 4.30లక్షల ఆదాయం పెరిగింది.