ప్యాపిలి మండలానికి పర్యాటక శోభ…
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి మండల పరిధిలోని వెంగలాంపల్లి చెరువు వద్ద రూ.3 కోట్లతో చేపట్టిన పర్యాటక వసతుల అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం ప్రారంభోత్సవం చేశారు. అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన పర్యాటక వసతులు స్థానికులను కట్టిపడేస్తున్నాయ్. బోటింగ్, రెస్టారెంట్ సహా ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్ తో ఏర్పాటు చేసిన మంత్రి చొరవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పర్యాటకాభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన పైలాన్ ను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. అనంతరం రెస్టారెంట్ లో స్థానిక నాయకులతో కూర్చుని ముచ్చటించి..టీ తాగారు.ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ శ్రీరామిరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ పోతుదోడ్డి క్రిష్ణమూర్తి,వైస్ ప్రెసిడెంట్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, వైసిపి నాయకులు బోర మల్లికార్జున రెడ్డి, బోరెడ్డిపుల్లారెడ్డి,బోరెడ్డి రఘునాథరెడ్డి, బోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజా మురళి కృష్ణ, విశ్వనాథ్ రెడ్డి, ఎర్రి స్వామి,పాండు , అంజి, శ్రీను, నిజాం,జక్కసానికుంట్ల భాస్కర్ రెడ్డి, వెంగళంపల్లె సర్పంచ్ రంగస్వామి,ధనుంజయ్య,మద్దయ్య, రామానాయుడు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, ఆర్డీవో, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.