వైసిపి అధినేత ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్యాపిలి మండల కన్వీనర్
1 min read
ప్యాపిలీ, న్యూస్ నేడు: తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్యాపిలి మండల కన్వీనర్ పోతు దొడ్డి కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం రాని వైసిపి నాయకులు కార్యకర్తలు అధైర్య పడద్దండి. తమకు నేను అండ ఉంటానని భరోసా ఇచ్చారని కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు , జడ్పిటిసిలు ఎంపీపీలు, మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.