పరమ పూజ్య శ్రీ మాతాజీ 100వ జయంతి
1 min read
పల్లెవెలుగు వెబ్:ప్రపంచమంతా శాంతి మరియు ప్రేమను స్థాపించడానికి మాతాజీ కృషి అభినందనీయమని హెచ్‌హెచ్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్టు సభ్యులు తెలిపారు. మంగళవారం మాతాజీ 100వ జయంతి సందర్భంగా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ శ్రీ మాతాజీ జీవిత కాలంలో సహజ యోగమును స్థాపించారు. 150 కంటే ఎక్కువ దేశాలలో సత్యన్వేషకులకు ఆత్మ సాక్షాత్కారాన్ని అందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా శాంతి సందేశంతోపాటు ప్రేమను స్థాపించారు. ఏ కులం వారైనా … ఏ మతం వారైనా సహజ యోగమును ఏ విధమైన వివక్ష లేకుండా అభ్యసించవచ్చు. శ్రీ మాతాజీ భారతీయుల విలువలను మరియు వారి యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేశారు. కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు సహజయోగం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. శాంతి, ఆనందం, ప్రేమ మరియు కరుణలతో మనల్ని ఆశీర్వదించి మనకు యోగాన్ని ప్రసాదించిన శ్రీ మాతాజీకి శతసహస్ర కోటి నమస్సుమాంజలులు తెలిపారు. మతాజీ శతజయంతి వేడుకల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.