NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఔట్ సోర్సింగ్’ లో పారా మెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ నియామకాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, విజయవాడ వారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డా॥ వై.యస్.ఆర్. కంటి వెలుగు కార్యక్రమము నందు ఔట్సోర్సింగ్ విధానములో పారా మెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ నియామకాలు జరుపనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేసారు. ఈ నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడును. ఔట్ సోర్సింగ్ విధానములో పారా మెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ నియామకాలు వివరములు మరియు దరఖాస్తు కొరకు kurnool.ap.gov.in/notice/recruitment వెబ్సైట్ను సందర్శించవలెను. అర్హులైన అభ్యర్థులు, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధి కార్యాలయము, కర్నూలు నందు 30-06-2021వ తేదిన ఉదయము 11:00 గం॥ నుండి సాయంత్రము 5:00 గంటల వరకు Walk-In-Interview జరుపబడును. అభ్యర్థులు తమ Original Certificate మరియు Xerox వెంట తీసుకొని రావలెను అని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

About Author