జనం తిరగబడితే పరార్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : జనం తిరగబడితే జగన్ రాష్ట్రం విడిచి పారిపోతాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వరద సాయం లో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను నిలువునా ముంచారని, ఇప్పుడు వరద బాధితులనూ అదే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రాష్ట్రంలో 77 గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయని, అయినా ప్రభుత్వానికి పట్టడం లేదని తప్పుబట్టారు. పొరుగున తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు పది వేల రూపాయల సాయం అందిస్తే.. ఇక్కడ బియ్యం ఇచ్చేందుకు కూడా గతి లేకుండా పోయిందన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో, యలమంచిలి మండలంలో వరద పీడిత దొడ్డిపట్ల అబ్బిరాజుపాలెం, లక్ష్మిపాలెం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.