చిన్నారులకు వచ్చే క్యాన్సర్లు, వైకల్యాలపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/20-10.jpg?fit=550%2C366&ssl=1)
లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు, కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి .లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు ఈరోజు చైల్డ్ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల్లో వచ్చే అంగవైకల్యాలు, పిల్లలు వచ్చే క్యాన్సర్ తదితర లక్షణాలపై ఇంటింటి అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు మార్కెట్ యార్డ్ పరిధిలో చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ కార్యక్రమంలో భాగంగా నేడు మార్కెట్ యార్డ్ పరిధిలో చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్,ఏ . ఎన్ ఎం ఆర్ బుజ్జమ్మ, ఆశ వర్కర్ ఆర్ .ప్రశాంతి, అంగన్వాడీ టీచర్ టీ .రాధికలు పాల్గొన్నారు .ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ 14 ఏళ్ల లోపు వచ్చే వాటిని చైల్డ్ హుడ్ క్యాన్సర్ అంటారని, పుట్టుకతోనే జన్యు లోపం లేదా వంశపారంపర్యంగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయని ,వాటిని తొలిదశలోనే గుర్తించగలిగితే పూర్తిగా నయం చేయగలిగే అవకాశాలు ఉంటాయన్నారు. గాయాలు అయినప్పుడు ఆగని రక్తస్రావం, చర్మం ,కళ్ళు పాలిపోవడం ,బరువు తగ్గడం, మూర్చ రావడం, గడ్డలు లాంటివి కనిపించడం, ఆకలి తగ్గడం ,కంటికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు తల్లిదండ్రులు గుర్తించగలిగితే సరైన సమయంలో వారికి వైద్యాన్ని అందించగలుగుతామన్నారు. అంగన్వాడి సెంటర్లో కూడా చిన్నారులు తల్లిదండ్రులకు చిన్నారులకు వచ్చే లోపాలు, చైల్డ్ హుడ్ క్యాన్సర్ గురించి కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. సమస్యలను గుర్తించిన చిన్నారులను డి.ఇ.ఐ.సీ సెంటర్కు పంపనున్నామన్నారు.