PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దత్తత తీసుకున్న చిన్నారిని తల్లిదండ్రులు సొంతబిడ్డలా చూసుకోవాలి..

1 min read

– జిల్లా కలెక్టర్ వె.ప్రసన్నవెంకటేష్

పల్లెవెలుగు వెబ్  ఏలూరు జిల్లా : దత్తత తీసుకున్న చిన్నారిని సొంతబిడ్డ కన్నా మిన్నగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సూచించారు.  స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సమక్షంలో మహిళా శిశు సంక్షేమ అధికారులు బేబి వివ్యబాల అనే 7 నెలలు వయస్సు గల పాపను తమిళనాడు రాష్ట్రానికి చెందిన దత్తత అర్జీదారులు లింగదొరై , జయంతి లకు చిన్నారిని దత్తత ఇవ్వడమైంది.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  వె. ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ చిన్నారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. దత్తత అర్జీదారులు 2019వ సంవత్సరంలో బాలిక శిశువు కొరకు ధరఖాస్తు పెట్టుకోగా ఈ రోజున వారు బేబి వివ్యబాలను దత్తత పొందారు.  లింగదొరై టి.వి. సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా జయంతి హోటల్ బిజినెస్ నిర్వహిస్తున్నారు.   ఈ కార్యక్రమం లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారాతధికారి, కె. పద్మావతి, డిసిపిఓ సిహెచ్. సూర్య చక్ర వేణి, బాలల రక్షణాధికారి ఆర్. రాజేష్, అవుట్ రీచ్ వర్కర్ కె.భార్గవి పాల్గొన్నారు.

About Author