భానుశంకర్కు..‘మంత్రాలయ పరిమళ ప్రశస్తి’ అవార్డు
1 min readసాఫ్ట్వేర్ రూపకల్పనలో కీలకపాత్రకు..గుర్తింపు
- శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ప్రశంస..
కర్నూలు, పల్లెవెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఆధునిక టెక్నాలజీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన భాను శంకర్‌కు ఆదివారం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు చేతుల మీదుగా ‘మంత్రాలయ పరిమళ ప్రశస్తి’ అవార్డును బహుకరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలు అందించినందుకుగాను అవార్డు అందజేసినట్లు శ్రీమఠం పీఠాధిపతులు ప్రశంసించారు. భానుశంకర్ వివిధ స్థాయిలో కేంద్ర మంత్రిత్వ శాఖలో , రాష్ట్ర గవర్నర్ కు సలహా దారునిగా పని చేస్తున్నారు. అంతేకాక ఆయన కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగారు. నిరాడంబరత్వము , మృదు స్వభావి , నిజాయితీకి మారు పేరుగా నిలిచినందుకు గుర్తింపుగా… మంత్రాలయ పీఠాధి పతి , “మంత్రాలయ పరిమళ ప్రశస్తి “ ప్రముఖ అవార్డును అందజేసినట్లు భాను శంకర్ వివరించారు. కార్యక్రమంలో ఏవిహారు, కన్నడ ప్రముఖ నటుడు శ్రీ రమేష్ అరవిందు పాల్గొన్నారు. గతము లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి శ్రీమతి సుధా మూర్తి మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు , ప్రముఖ సినీ నటులు రజిని కాంత్ తదితరులు ఈ అవార్డు దక్కించుకున్నారు.