PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పరిషత్​’.. ప్రశాంతం..

1 min read
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అథారిటి , కలెక్టరు వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప,

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అథారిటి , కలెక్టరు వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప,

– 60.28 శాతం పోలింగ్​..
– ఓటు హక్కు వినియోగించుకున్న 9,38,379 మంది
– అత్యధికంగా ఆళ్లగడ్డలో 74.42% .. అతితక్కువ వెలుగోడు 40.94శాతం పోలింగ్​
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్పలు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు బ్యూరో: కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు పోలింగ్​ శాతం కూడా పెరిగింది. గురువారం కలెక్టరేట్ ఎన్నికల వార్ రూమ్/కంట్రోల్ రూమ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప మాట్లాడారు. సమావేశంలో పరిషత్ ఎన్నికల స్టేట్ స్పెషల్ ఆఫీసర్ రామ్ శంకర్ నాయక్, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, సమాచార శాఖ ఉప సంచాలకులు తిమ్మప్పలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్ మాట్లాడుతూ జిల్లాలోని 44 మండలాలలో 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు 1785 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగగా అందులో మొత్తం 15,56,617 ఓటర్లు ఉండగా 9,38,379 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకున్నారు. అత్యధికంగా ఆళ్లగడ్డ మండలంలో 74.42% నమోదైంది.. అతి తక్కువ వెలుగోడు మండలంలో 40.94 శాతం పోలింగ్ నమోదైందన్నారు. అనంతరం ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప మాట్లాడుతూ జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసిందని, అందుకు విశేషంగా కృషి చేసిన పోలీసులు మరియు అధికారులకు, సహకరించిన మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు.

About Author