PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆడవారిలో పార్కిన్సన్స్ జబ్బు ఎక్కువ

1 min read

అంతర్జాతీయ పార్కిన్సన్స్ దినోత్సవం

ఏప్రిల్ 11న డా. చల్లెపల్లె బాబురావుకన్సల్టెంట్ న్యూరాలజిస్ట్

కిమ్స్ హాస్పిటల్, కర్నూలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పార్కిన్సన్ (Parkinson) జబ్బును కంపవాతం అని కూడా అంటారు. ఈ వ్యాధి గురించి వేదకాలంలోనే ప్రస్తావించడం జరిగింది. ఆయుర్వేద సంహితంలో అంటే ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రంలో ఈ వ్యాధి లక్షణాల గురించి వివరించడం జరిగింది. ఈ వ్యాధిని 18వ శతాబ్దంలో జేమ్స్ పార్కిన్సన్ అనే ఆంగ్ల వైద్యుడు షేకింగ్ పాల్సి (Shaking Palsy) అని పేరు పెట్టినప్పటికి, కనిపెట్టి వారి పేరుతోనే ఇది ప్రాచూర్యం పొందింది. ఈ వ్యాధి గురించి ప్రాథమిక అవగాహన కల్పించడానికి ఆయన జన్మదిన రోజును ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవంగా జరుపుకుంటారు.

పార్కిన్సన్స్ జబ్బు రావడానికి గల కారణాలు:మనం చేసే పనులన్నింటిని మెదడు నియంత్రణ చేస్తుంది. న్యూరాన్ల నుండి అందే సంకేతాల కారణంగా నడవడం, మాట్లాడటం వంటివి చేయగలుగుతాము. ఈ విధంగా నాడీ కణాల మధ్య సమాచార మార్పిడికి డొపమైన్ వంటి రసాయనాలు అవసరం అవుతాయి. డొపమైన్ అనేది చిన్న మెదడులో Substantia nigraలో కణాల నుండి ఉత్పత్తి అవుతుంది. పార్కిన్సన్ అనే జబ్బు ఈ కణాల తగ్గడం వల్ల వస్తుంది.

ఎవరికి పార్కిన్సన్స్ జబ్బు వస్తుంది?పార్కిన్సన్ జబ్బు అనేది ఎవరికైనా రావొచ్చు. ఇది మగవారిలో ఆడ వారిలోకన్నా ఎక్కువ వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన కారణం వయస్సు మీద పడటం. 60 సంవత్సరాలు దాటిన తరువాత సాధారణంగా దీని బారిన పడుతారు. మన భారత దేశంలో 60 సంవత్సరాలు దాటిన వారిలో ఒకశాతం ఈ జబ్బుతో బాధపడుతున్నారు. కొంతమందిలో ఈ జబ్బు 20 సంవత్సరాలలోపు వారికి కూడా రావొచ్చు. దానిని Juvenil Parkinson గా పిలుస్తాము. జన్యుపరమైన అంశాలు దీనికి కారణంగా భావిస్తున్నారు.పార్కిన్సన్ జబ్బు లక్షణాలుఈ జబ్బుకు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి ఈ లక్షణాలు శరీరంలో ఒకవైపున మొదలలై, క్రమంగా రెండోవైపుకు కూడా ప్రాకుతుంది.

ముఖ్యమైన లక్షణాలు:

కదలికలు నెమ్మదిస్తాయి: దీన్ని బ్రాడికైనేషియా అని పిలుస్తారు. దీనివల్ల నడవడానికి, స్నానము చేయడానికి, దుస్తులు ధరించడానికి ముందుకన్నా ఎక్కువ సమయం తీసుకోవడంతోపాటు ఇబ్బందులు ఎదురవుతాయి.వణుకు: చేతులు, కాళ్లు, తల, దవడ వంటి భాగాలు వణుకుతుంటాయి. సాధారణంగా చేతుల్లో వణుకు మొదలవుతుంది. పనులు చేస్తున్నప్పుడు కాకుండా విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా వణకడం ఈ జబ్బుకు ఉన్న ఒక ప్రత్యేక లక్షణం.- కాళ్లు, చేతుల్లో కండరాలు బిగుసుకుపోవడం గమనిస్తాము.సమన్వయం లేకపోవడం: బ్యాలెన్స్ తప్పడం మరో లక్షణం. ఈ వ్యాధి ముదిరేకొద్ది కొందరు క్రింద పడిపోయే ప్రమాదం ఉంటుంది.కొందరిలో డిప్రేషన్ (క్రుంగుబాటు), మతిమరుపు, నిద్ర సమస్యలు, మలబద్ధకంలాంటి సమస్యలు గమనించ వచ్చును. ఆహారం మింగడానికి కూడా ఇబ్బంది లాంటి సమస్యలను గమనించ వచ్చును.చేతిరాత మార్పును గమనించ వచ్చును.కొందరిలో వాసనను గుర్తించడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది పార్కిన్సన్ జబ్బుకి మొదటి లక్షణమై కూడా ఉండవచ్చును.జబ్బు నిర్ధారణ : పార్కిన్సన్స్ వ్యాధిని పసిగట్టడం అన్నది ప్రధానంగా వ్యాధి లక్షణాలనుబట్టి, క్లీనికల్ పరీక్షల సహాయంతో జరుగుతుంది. నిర్ధారణ కోసం కొన్నిసార్లు ఎమ్మారై పరీక్ష, డోపాపెట్ స్కాన్ బ్రెయిన్ పరీక్షలు అవసరం అవుతాయి. కుటుంబంలో ఎక్కువ మందికి ఈ సమస్య ఉన్నా, చిన్న వయస్సులోనే పార్కిన్సన్స్ వచ్చిన జన్యుపరీక్ష అవసరం అవుతుంది.

చికిత్స:ప్రస్తుతానికి పార్కిన్సన్స్ను నయం చేసే చికిత్స ఏదీ లేదు. కాని మందులతో లక్షణాలను నియంత్రణలో ఉంచు కోవచ్చును. పార్కిన్సన్ ప్రారంభ దశలో లెవోడోపా, డోపమైన్ అగోనిస్ట్స్ వంటి మందులు సరిపోతాయి. వ్యాధి పెరిగేకొద్ది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS), అపోమోర్ఫిన్ పంప్ థెరపి, లెవోడోపా కార్బిడోపా ఇంటెస్టినల్ జెల్ ఇన్ఫూషన్ థెరపి వంటి ఆధునిక చికిత్సలు అవసరం అవుతాయి. సైక్రియాట్రిస్ట్ సలహా తప్పనిసరి. వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మెరుగైన జీవితాన్ని గడపవచ్చును.

About Author