NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించింది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్‌ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్‌ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెగాసస్, రైతు ఆందోళనలు, చైనా దురాక్రమణలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

     

About Author